ఏపీలో ఇవాళ ఒక్కరోజే 114 మంది మృతి

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 114 మంది మృతి
  • అత్యధికంగా ప.గో జిల్లాలో 17మంది, చిత్తూరులో 15 మంది మృతి
  • కొనసాగుతున్న కరోనా స్వైర విహారం
  • ఇవాళ 22 వేల 610 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో 114 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఒకవైపు లాక్ డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తూ మరోవైపు వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నా కరోనా మరణాలతోపాటు  కొత్త కేసులు.. రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. యాదృచ్చికమో కాకతాళీయమో గాని ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇవాళ కూడా 17 మంది చనిపోయారు. నిన్న 17 మంది చనిపోగా ఇవాళ కూడా నిన్నటి తరహాలోనే 17 మంది చనిపోవడంతో కరోనా మరణాల్లో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో 15 మరణాలు నమోదయ్యాయి. తర్వాత వరుసగా తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 10 మంది చొప్పున, అనంతపురం, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో 9 మంది చొప్పున, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, అదేవిధంగా నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు.  గడచిన 24 గంటల్లో 1 లక్షా 1 వేయి 281 మంది పరీక్షలు చేయగా 22 వేల 610 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే 23 వేల 98 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.